మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన సాలిడ్ చిత్రమే పెద్ది. మంచి హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా అవుట్ పుట్, కంటెంట్ పరంగా మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. అయితే ఇలాంటి సినిమా కావాల్సిన రీచ్ అందుకోవాలి అంటే ఖచ్చితంగా దానిని ఆడియెన్స్ లోకి ఎలా తీసుకెళ్లాం అనే దాన్నిబట్టి కూడా ఉంటుంది.
ఆల్రెడీ వచ్చిన రెండు పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఇక అసలు టాస్క్ ఇప్పుడు మేకర్స్ ముందు ఉంది. సినిమాకి ప్రమోషన్స్ మాత్రం గట్టిగా చేయాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా సినిమా వసూళ్లు భారీ స్థాయిలో ఉండాలి అంటే నార్త్ ఇండియా మార్కెట్ లో వసూళ్లు తప్పనిసరి.
సో అక్కడ ప్రమోషన్స్ పరంగా ఎక్కడా తగ్గకూడదు అని వారు భావిస్తున్నారు. హిందీ నుంచి జాన్వీ కపూర్, మీర్జాపూర్ ఫేమ్ దివ్యెందు శర్మలు ఉన్నారు, చరణ్ కి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సో వీరితో కరెక్ట్ గా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తే మంచి ఓపెనింగ్స్ పెద్ది చిత్రానికి గ్యారెంటీ. సో ఇక నుంచి మొత్తం అంతా మేకర్స్ చేతిలోనే ఉంది. ఈ గ్యాప్ లో వారు ఎలా ఈ సినిమాని తీసుకెళ్తారో చూడాలి.


