టైటిల్స్ టు ఎండ్ కార్డ్ నవ్వులే నవ్వులు @ ‘భలే భలే మగాడివోయ్’

టైటిల్స్ టు ఎండ్ కార్డ్ నవ్వులే నవ్వులు @ ‘భలే భలే మగాడివోయ్’

Published on Aug 26, 2015 8:28 AM IST

Bhale-Bhale-Magadivoy
సినిమా సినిమాకి తను సెలక్ట్ చేసుకునే పాత్రల్లో ఎంతో వైవిధ్యం చూపే యంగ్ హీరో నాని. తెలుగు ప్రేక్షకుల మదిలో తన ఫ్యామిలీ లో ఒకడుగుగా కలిసిపోయిన నాని మతిమరుపుకు బ్రాండ్ అంబాసిడర్ మరియు గజినీకి కజిన్ లా అనిపించేలా చేసిన సినిమా ‘భలే భలే మగాడివోయ్’. పూర్తి వినోదాత్మకమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. చిన్న సినిమాల స్పెషలిస్ట్ అయిన మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రతిదీ మరిచిపోయే పాత్రలో నాని కనిపిస్తాడు.

ఇంట్లో ఉన్న తన అమ్మ పేరు, ఓ టిప్ టాప్ గా రెడీ అయ్యాక ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోవడం, బైక్ లేకుండానే పెట్రోల్ కోసం పెట్రోల్ బంక్ దాకా వెళ్ళడం, చివరికి తను ఎంతో ప్రేమించే అమ్మాయి పేరు కూడా మర్చిపోయేంతలా మతి మరుపు ఉండడమే మన హీరో స్పెషాలిటీ.. అలాంటి పాత్రలో చక్కని నటనని కనబరిచి అందరినీ తెగ నవ్విస్తాడని అంటున్నాడు డైరెక్టర్ మారుతి. ‘ఇప్పటి వరకూ నేను చేసిన ప్రతి సినిమాలోనూ కామెడీ ఉంటుంది. వాటన్నిటికంటే మించి ఈ సినిమాలో కామెడీ ఉంటుంది. టైటిల్స్ నుంచి ఎండ్ కార్డ్ పడేంత వరకూ అందరూ నవ్వుతూనే ఉంటారు. థియేటర్స్ లో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసే సినిమా భలే భలే మగాడివోయ్’ అని మారుతి తెలిపాడు.

నాని సరసన ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ అందించాడు. గీత ఆర్ట్స్ 2 – యువి క్రియేషన్స్ వారు కలిసి ఈ సినిమాని నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు