
సినీ ప్రపంచానికి, రాజకీయ ప్రపంచానికి పెద్దగా దూరం ఉండదన్న విషయాన్ని ఇప్పటికే చాలా మంది ప్రముఖులు నిరూపించి చూపారు. తాజాగా ఈ కోవలో టీఆర్‌ఎస్ లీడర్, తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత కూడా ఈ విషయాన్ని మరోసారి ఋజువు చేశారు. తెలంగాణ జాగృతి పేరుతో పలు విజయవంతమైన సామాజిక కార్యక్రమాలను చేపట్టిన కవిత, సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టి ఒక సోషల్ మెసేజ్ ఉన్న అంశంతో సినిమాను రూపొందిస్తున్నారు.
ప్రముఖ నటి గౌతమి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా క్యాన్సర్‌పై అవగాహన కల్పించడమనే అంశాన్ని హైలైట్ చేస్తోంది. ‘లైఫ్ అగైన్’ పేరుతో రూపొందుతీన్న ఈ సినిమాకు హైమా రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గౌతమి, హైమా రెడ్డి.. ఈ ఇద్దరూ గతంలో క్యాన్సర్ బారిన పడి దాన్ని జయించి మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టినవారే కావడం విశేషంగా కనిపిస్తోంది. తెలంగాణ జాగృతి కువైట్ అండ్ బెహ్రయిన్ వింగ్ ఆధ్వర్యంలో ఈ సినిమా నిర్మితమవుతోంది.

