‘రుద్రమదేవి’ కొత్త రిలీజ్ డేట్..?

‘రుద్రమదేవి’ కొత్త రిలీజ్ డేట్..?

Published on Aug 27, 2015 1:01 AM IST

rudhramadevi-(1)
గుణశేఖర్ కలల ప్రాజెక్ట్ అయిన ‘రుద్రమదేవి’ భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. భారతదేశపు మొట్టమొదటి ౩డీ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రుద్రమదేవి పాత్రను అనుష్క పోషించగా, మరో ప్రధాన చారిత్రక గోనగన్నారెడ్డి పాత్రను హీరో అల్లు అర్జున్ పోషించారు. హీరో రానా, నిత్యామీనన్‌లు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ట్రైలర్, పోస్టర్స్‌తో అన్ని విధాలా అంచనాలు పెంచేసిన ఈ సినిమా, ఈ మధ్యే ప్రమోషన్స్ ద్వారా కూడా ప్రేక్షకులకు చేరువవుతోంది.

ఇప్పటికే చాలా ఏరియాలకు సంబంధించిన బిజినెస్ కూడా జోరుగా జరుగుతోన్న నేపథ్యంలో రుద్రమదేవి వరుస హిట్లతో జోరుమీదున్న తెలుగు సినిమాకు మరింత ఉత్సాహాన్నిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఇక సెప్టెంబర్ 4న ఈ సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాత గుణ శేఖర్ భావించినా, 3డీ సంబంధిత పనులింకా పెండింగ్‌లోనే ఉండిపోవడంతో సినిమా మరో రెండు వారాలు వెనక్కి వెళ్ళిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 17న గానీ, 24న గానీ ‘రుద్రమదేవి’ సినిమా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, అనుష్క పర్ఫామెన్స్, గుణ శేఖర్ టేకింగ్, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా మార్క్ సంగీతం ఈ సినిమాకు హైలైట్‍గా నిలవనున్నాయని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు