విష్ణు కెరీర్లో భారీ ఎత్తున రిలీజ్ కానున్న ‘డైనమైట్’

విష్ణు కెరీర్లో భారీ ఎత్తున రిలీజ్ కానున్న ‘డైనమైట్’

Published on Aug 31, 2015 9:31 PM IST

Dynamite
ప్రతి సినిమాతోనూ నటునిగా ఒక్కో మెట్టు పైకి ఎక్కుతున్న మంచు విష్ణు ‘రౌడీ’, ‘అనుక్షణం’, ‘ఎర్రబస్సు’ లాంటి డిఫరెంట్ డిఫరెంట్ సినిమాల తర్వాత తను హీరోగా చేసిన యాక్షన్ థ్రిల్లర్ ‘డైనమైట్’. పెర్ఫార్మన్స్ కి, ఇంటెన్స్ ఉన్న సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే దేవకట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రణిత హీరోయిన్ గా నటించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అంతే కాకుండా ఇండియా, యుఎస్, యుకె, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఈ సినిమాకి సెప్టెంబర్ 3న ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు.

హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమాకి ఇండస్ట్రీ నుంచి పూర్తి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. అలాగే ఈ సినిమాని మంచు విష్ణు కెరీర్లో ఇప్పటి వరకూ రిలీజ్ కానన్ని థియేటర్స్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. ఆంధ్ర, తెలంగాణ, మిగిలిన ఇండియాతో పాటు ఓవర్సీస్ స్క్రీన్స్ కూడా కలుపుకొని సుమారు 600-700 థియేటర్స్ లో రిలీజ్ కానుందని సమాచారం. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మంచు విష్ణు చేసిన రియలిస్టిక్ యాక్షన్ ఎపిసోడ్స్ మరియు స్పీడ్ గా సాగే స్క్రీన్ ప్లే ఈ సినిమాకి హైలైట్ కానుంది. మంచు విష్ణుతో పాటు ప్రణిత కూడా రియలిస్టిక్ స్టంట్స్ చేసిన ఈ సినిమాలో జెడి చక్రవర్తి మెయిన్ విలన్ గా కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు