నెలరోజుల ముందే లాక్ చేసిన ‘కంచె’ రన్ టైం

నెలరోజుల ముందే లాక్ చేసిన ‘కంచె’ రన్ టైం

Published on Sep 1, 2015 7:42 PM IST

Kanchae
‘ముకుంద’ లాంటి డిఫరెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్. మొదటి సినిమా కంటే చాలా డిఫరెంట్ గా రెండవ సినిమాని ప్లాన్ చేసారు. ఆ సినిమానే వరల్డ్ వార్ II బ్యాక్ డ్రాప్ లో రానున్న సినిమా ‘కంచె’. ఇప్పటి వరకూ తెలుగు తెరపై రాణి పాయింట్ ని బేస్ చేసుకొని సరికొత్త కథాశంతో తెరకెక్కిన ఈ సినిమాకి క్రిష్ డైరెక్టర్. రేపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డేని పురష్కరించుకొని ఈ రోజు ఉదయం ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా కంచె థియేటర్ ట్రైలర్ ని లాంచ్ చేసారు.

ఈ ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఇండస్ట్రీలోని ప్రముఖులందరూ ఈ సినిమా ట్రైలర్ పై ప్రశంశలు కురిపిస్తున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఈ చిత్ర డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా రన్ టైం ఎంతనేది రివీల్ చేసారు. కంచె సినిమా రన్ టైం కేవలం 2 గంటల 5 నిమిషాలు మాత్రమే అని, సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా స్పీడ్ గా సాగుతుందని తెలియజేశాడు. అలాగే ఆన్ స్క్రీన్ విజువల్స్ కూడా ఆడియన్స్ ని థ్రిల్ చేసేలా ఉంటాయని తెలియజేశారు. వరుణ్ తేజ్ సరసన ప్రాగ్య జైస్వాల్ హీరోయిన్ గా కనిపించనుంటే, బాలీవుడ్ యాక్టర్ నికేతన్ దీర్ విలన్ గా కనిపించనున్నాడు. సెప్టెంబర్ 12న గ్రాండ్ గా ఆడియోని రిలీజ్ చేసి, అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు