
‘గోపాల గోపాల’ లాంటి క్లాస్ మల్టీ స్టారర్ మూవీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. మొదటి షెడ్యూల్ లో ఒక యాక్షన్ ఎపిసోడ్ తో పాటు విలన్స్ కి దమ్కీ ఇచ్చే కొన్ని సీన్స్ ని షూట్ చేయగా, సెకండ్ షెడ్యూల్ లో నైట్ ఎఫెక్ట్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసారు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున ఏపి రాజధాని రైతుల సమస్యలను తెలుసుకోనున్నాడు.
తాజాగా ఈ చిత్ర టీం తెలిపిన సమాచారం ప్రకారం సెప్టెంబర్ ఫస్ట్ వీక్ చివరి నుంచి హైదరాబాద్ లో మూడవ షెడ్యూల్ ని మొదలు పెట్టనున్నారు. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు విలన్ గా కనిపించనున్న కబీర్ సింగ్ కూడా జాయిన్ కానున్నాడు. రేపు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు రాత్రి 12 గంటలకి ఈ చిత్ర టీం ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకుడు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.

