రజనీ సినిమాపై ఎగ్జైటింగ్‌గా ఉన్న డైరెక్టర్ రంజిత్!

రజనీ సినిమాపై ఎగ్జైటింగ్‌గా ఉన్న డైరెక్టర్ రంజిత్!

Published on Sep 3, 2015 7:01 PM IST

kabali
పా రంజిత్.. తమిళంలో ‘అత్తకట్టి’, ‘మద్రాస్’ ఇలా చేసిన సినిమాలతోనే తనదైన గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు. ఈ రెండు సినిమాల తర్వాత ఏకంగా సూపర్ స్టార్ రజనీ కాంత్‌ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని సొంతం చేసుకొని టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయిన రంజిత్, ప్రస్తుతం రజనీతో చేయనున్న ‘కబాలి’ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను చివరిదశకు చేర్చారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మితమవుతోన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది.

ఇక ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ రజనీ సినిమా ఆఫర్ రావడం సంతోషంగా ఉందంటూ, రజనీకి తాను కథను వినిపించిన రోజును రంజిత్ ఓ అవార్డు ఫంక్షన్ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తనకు కమర్షియల్ కథలు రాయడం రాదని, కథను ఒకరికి అందంగా చెప్పే విద్య కూడా తెలియదని చెబుతూ రజనీ సార్‌కి కథ చెప్పడమంటే మొదట భయమేసిందని ఆయన తెలిపారు. తన మద్రాస్ సినిమాను అప్పటికే రెండు సార్లు చూసి, ఎంతో నచ్చిందని చెప్పిన రజనీకి తాను ‘కబాలి’ కథను గంటన్నర పాటు చెప్పానని రంజిత్ చెప్పుకొచ్చారు. రజనీని తాను ఎలా చూడడం ఇష్టపడతానో అలానే చూపించేందుకు కృషి చేస్తానని రంజిత్ ఈ సందర్భంగా తెలియజేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు