‘పెద్ది’ ఫైనల్ కట్ లాక్.. 3న భారీ ఎత్తున ప్రీమియర్స్ కి రెడీ!

‘పెద్ది’ ఫైనల్ కట్ లాక్.. 3న భారీ ఎత్తున ప్రీమియర్స్ కి రెడీ!

Published on May 7, 2026 2:30 PM IST

peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన మల్టీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు విడుదలకి దగ్గరకు వస్తుంది. ఇక ఈ నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు సానా అభిమానులకి సాలిడ్ అప్డేట్ ని అందించడం జరిగింది. పెద్ది ఫైనల్ కట్ ఎడిట్ ని లాక్ చేసేసినట్టు తాను తెలిపాడు.

అంతే కాకుండా రానున్న జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ ప్రీమియర్స్ తో పెద్ది మేనియా మొదలు కాబోతుంది అని జూన్ 4న ఫుల్ ఫ్లెడ్జ్ గా థియేటర్స్ లో పెద్ది టేకోవర్ ఉంటుంది అని కాన్ఫిడెంట్ గా ఖరారు చేసేసారు. దీంతో తన పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తుండగా జగపతి బాబు, శివరాజ్ కుమార్ అలాగే దివ్యెందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించగా వృద్ధి సినిమా, సుకుమార్ రైటింగ్స్ లో నిర్మించబడింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు