
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శ్రీనువైట్లల క్రేజీ కాంబినేషన్లో భారీ ఎత్తున ‘బ్రూస్లీ’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దర్శకుడు శ్రీనువైట్ల బ్రాండ్ మార్క్ కామెడీతో పాటు, రామ్ చరణ్ స్టైల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో వస్తోన్న ఈ సినిమా అందరినీ మెప్పిస్తుందని సినిమా యూనిట్ చెబుతోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన యాక్షన్ టీజర్, పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫ్యామిలీ సెంటిమెంట్ టీజర్ సినిమాపై విపరీతమైన ఆసక్తిని పెంచేశాయి.
ఇక శ్రీనువైట్ల సినిమాలంటేనే సాధారణంగా యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో పాటు మేజర్ అట్రాక్షన్‌గా నిలిచేది కామెడీ. ఈ నేపథ్యంలోనే ‘బ్రూస్లీ’ సినిమాలో ఏ రేంజ్ కామెడీ ఉండనుందనే విషయంపై అభిమానులు ఇప్పట్నుంచే రకరకాల ఊహాగానాలు చేసేస్తున్నారు. ఈ సినిమా రచయిత కోన వెంకట్ ఇదే విషయంపై మాట్లాడుతూ “ఇప్పటివరకూ యాక్షన్, ఫ్యామిలీ టీజర్స్‌తో సినిమా ఈ రెండు అంశాల్లో ఎలా ఉండనుందనేది తెలియజేశాం. త్వరలోనే ఓ కామెడీ టీజర్‌తో మిమ్మల్ని మెప్పించేందుకు వచ్చేస్తున్నాం” అని తెలిపారు. డీవీవీ దానయ్య నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించారు.

