
పీరియాడికల్ ఫిల్మ్స్ కి మళ్ళీ టాలీవుడ్ లో శ్రేకారం చుడుతూ చేసిన రెండు భారీ బడ్జెట్ సినిమాలు బాహుబలి, రుద్రమదేవి. అందులో బాహుబలి ఇప్పటికే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిపోవడంతో ఇప్పుడు అందరి చూపు రుద్రమదేవి పైకి షిఫ్ట్ అయ్యింది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమాని ఫైనల్ గా అక్టోబర్ 9న రిలీజ్ చెయ్యడానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్ర నిర్మాత, దర్శకుడు గుణశేఖర్ రుద్రమదేవిని ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం హిందీ వెర్షన్ కి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలతో పాటు, సాంగ్స్ రికార్డింగ్ కూడా జరుగుతోంది.
గుణశేఖర్ తాజాగా బాలీవుడ్ టాప్ సింగర్స్ ని ఈ సినిమా సాంగ్స్ పాడించడం కోసం రంగంలోకి దింపాడు. వారిద్దరే జావేద్ అలీ, పలక్ ముచ్చల్. వీరిద్దరి సింగర్స్ చేత హిందీ వెర్షన్ సాంగ్స్ పాడిస్తున్నారు. త్వరలోనే హిందీ డబ్బింగ్ కార్యక్రమాలను కూడా ఫినిష్ చేయనున్నాం. మరోవైపు చివరి దశలో ఉన్న 3డి వర్క్స్ కూడా జరుగుతున్నాయి. మరోవైపు రిలీజ్ కి ఇంకా నెల రోజులు మాత్రమే ఉండడంతో అన్ని భాషల్లో ప్రమోషన్స్ ని మొదలు పెట్టనున్నారు. రుద్రమదేవిగా అనుష్క కనిపించనున్న ఈ సినిమాలో చాళుక్య వీరభద్రుడుగా రానా, గోనగన్నా రెడ్డిగా అల్లు అర్జున్ కనిపించనున్నాడు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు, నిత్యా మీనన్, కేథరిన్, హంసా నందినిలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

