టాలీవుడ్లో వచ్చిన హలీవుడ్ స్టైల్ మూవీ ‘డైనమైట్’ – టి. సుబ్బరామి రెడ్డి

టాలీవుడ్లో వచ్చిన హలీవుడ్ స్టైల్ మూవీ ‘డైనమైట్’ – టి. సుబ్బరామి రెడ్డి

Published on Sep 6, 2015 6:39 PM IST

subirami-reddy
ఆరడుగుల పొడవుతో కండలు తిరిగిన ఫిజిక్ తో యంగ్ హీరో మంచు విష్ణు చేసిన యాక్షన్ థ్రిల్లర్ ‘డైనమైట్’. టాలీవుడ్ కి చాలా కొత్త యైన యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలై అన్ని ప్రాంతాల నుంచి సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటూ దూసుకుపోతున్న ఈ సినిమాకి కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాని టాలీవుడ్ లో ప్రముఖుడైన టి.సుబ్బరామిరెడ్డి గారు డైనమైట్ సినిమా చూసారు. ఆయన సినిమాని చూసి బాగా ఇంప్రెస్ అవ్వడమే కాకుండా సినిమాపై ప్రశంశలు కురిపించారు.

డైనమైట్ సినిమా చూసాక టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ‘డైనమైట్ ప్యూర్ యాక్షన్ ఎంటర్టైనర్. సినిమా మొదటి నుంచి చివరి దాకా సస్పెన్స్ ని క్రియేట్ చెయ్యడంలో, దాన్ని అంతే సస్పెన్స్ గా డీల్ చెయ్యడంలో టీం సక్సెస్ అయ్యింది. నాకు టాలీవుడ్ లో వచ్చిన హాలీవుడ్ స్టైల్ ఉన్న సినిమాలా అనిపించింది. యాక్షన్ ఎపిసోడ్స్ ని చాలా బాగా డిజైన్ చేసారు. ఇలాంటి సినిమా చేసినందుకు మంచు విష్ణుని మెచ్చుకుంటున్నాను. మ్యూజిక్ కూడా సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యిందని’ తెలిపారు. సుబ్బరామిరెడ్డి గారు ఇచ్చిన కాంప్లిమెంట్స్ విషయంలో మంచు విష్ణు చాలా హ్యాపీగా ఉన్నాడు.

దేవా కట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రణిత హీరోయిన్ గా నటించింది. జెడి చక్రవర్తి విలన్ గా కనిపించిన ఈ సినిమాకి విజయం మాస్టర్ యాక్షన్ ఎపిసోడ్స్ కంపోజ్ చేసాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు