
తమిళంలో ఆగష్టు 28న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన సినిమా ‘తని ఒరువన్’. జయం రవి హీరోగా అలనాటి స్టార్ హీరో అరవింద్ స్వామి విలన్ గా నటించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రీమేక్ కోసం ఇప్పటకే పలువురు తెలుగు నిర్మాతలు పోటీ పడుతున్నారు. అది పక్కన పెడితే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమా రీమేక్ పై అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారు. మహేష్ బాబు నిన్న స్పెషల్ గా ‘తని ఒరువన్’ సినిమా చూసారు. మహేష్ బాబుకి సినిమా బాగా నచ్చడంతో ఆయన ఈ సినిమా రీమేక్ పై అత్యంత ఆసక్తి కబరుస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా రీమేక్ పై ఆసక్తి కనబరుస్తుండడంతో ఏ నిర్మాత, ఏ డైరెక్టర్ ఆయనతో జాయిన్ అవుతారు అనేది చూడాలి. కార్పోరేట్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్న మోసాలను అరికట్టడమే పనిగా పెట్టుకున్న ఓ పోలీస్ ఆఫీసర్ కథే ఈ ‘తని ఒరువన్’. ఇప్పటికే పలు సార్లు పోలీస్ ఆఫీసర్ గా కనిపించి మెప్పించిన మహేష్ బాబుకి ఈ కథ బాగా సెట్ అవుతుందని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారికంగా క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ కూడా ఈ సినిమాపై ఆసక్తిగానే ఉన్నట్లు సమాచారం. మరి ఎవరి చేతికి ఫైనల్ గా రీమేక్ రైట్స్ వెళ్తాయా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

