‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ మళ్ళీ వాయిదా..?

‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ మళ్ళీ వాయిదా..?

Published on Sep 7, 2015 11:29 PM IST

Courier-Boy-Kalyan-First-Lo
కొరియర్ బాయ్ కళ్యాణ్.. వరుస హిట్స్‌తో జోరు మీదున్న నితిన్ హీరోగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మాతగా తెరకెక్కించిన సినిమా. ఓ సరికొత్త కథాంశంతో, సరికొత్త ట్రీట్‌మెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా గౌతమ్ మీనన్ శిష్యుడు ప్రేమ్ సాయి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే పలు ఆర్థిక సమస్యలతో చాలాకాలంగా వాయిదా వచ్చిన ఈ సినిమా చివరకు సెప్టెంబర్ 11వ తేదీకి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.

కాగా తాజా సమాచారం మేరకు సినిమా సెప్టెంబర్ 11నుంచి మరోవారం వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. నిర్మాత గౌతమ్ మీనన్ ఈ ఉదయం కొరియర్ బాయ్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. నేటితో సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. బుధవారం రోజున సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం అని తెలిపారు. దీంతో సినిమా సెప్టెంబర్ 11కు రావట్లేదన్న విషయం దాదాపు స్పష్టం అయింది. ప్రస్తుతం సెప్టెంబర్ 16ను సినిమాకు పర్ఫెక్ట్ రిలీజ్ డేట్‌గా సినిమా యూనిట్ భావిస్తోంది. వినాయక చవితి వీకెండ్ బాగా కలిసివస్తుందని సినిమా యూనిట్ ఆ రకంగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ విషయమై సినిమా యూనిట్ నుంచి ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు