
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘బాహుబలి’ సృష్టించిన అద్భుతాల గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. విజువల్స్ పరంగా తెలుగు సినిమాను అంతర్జాతీయ తీసుకెళ్ళిన ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ మన కళ్ళ ముందే కదలాడుతూ, ‘బాహుబలి’ ఫీల్‌ను గుర్తు తెస్తాయి. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ శివ లింగాన్ని మోసుకొని వెళ్ళే ఓ సన్నివేశం కూడా సినిమాకు ఓ ప్రత్యేక ఫీల్‌ను తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆ నేపథ్యంలోని పోజ్‌తో వినాయక విగ్రహాలు రూపొందడం విశేషం.
ఈ వినాయక చవితికి భక్తులు ‘బాహుబలి’ గణేష్ విగ్రహాలను ప్రతిష్టించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొనే విగ్రహ తయారీదారులు బాహుబలి సినిమాలో ప్రభాస్ శివ లింగం మోసుకెళ్ళే తరహాలో వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఈ విగ్రహాల కొనుగోలుకు యువత బాగా మక్కువ చూపుతున్నారని తెలుస్తోంది. ఇక ఈ ఏడాది వినాయక చవితికి తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి గణేష్ సందడి ఉంటుందని చెప్పుకోవచ్చు.

