రెహమాన్ ప్రదర్శనకి ఆటంకాలు

రెహమాన్ ప్రదర్శనకి ఆటంకాలు

Published on Sep 13, 2015 6:47 PM IST

ar-rehman
పెర్షియా బాషలో తెరకేక్కబోయే సినిమాలో మతానికి సంబంధించిన కొన్ని కరాణాల మూలంగా ఇప్పటికే ఫత్వా అందుకున్న ఏ ఆర్ రెహమాన్ కి మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజ్ మహల్ దగ్గర రెహమాన్ ప్రోగ్రాంని పురావస్తుశాఖ అడ్డంకులు తెలిపింది. ఎన్.ఆర్.ఐ డే సందర్భంగా నవంబర్ 21న ఈ వేడుకని నిర్వహించనున్న సంగతి తెలిసినదే.

ఈ వేడుకలో శబ్దకాలుష్యం కారణంగా చారిత్రాత్మక కట్టడానికి జరిగే ప్రమాదం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ శాఖ ముఖ్య అధికారి తెలిపారు. 2011లో సైతం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ సమక్షంలో జరుగిన ఇటువంటి వేడుకలు ఈ శాఖ వారే అడ్డంకులు పెట్టిన సంగతి తెలిసినదే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు