
అందమైన కుటుంబ బంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో చక్కటి సినిమాలు తీసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దశరథ్, విలక్షణ సినిమాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనోజ్‌తో ఓ సినిమా కోసం జతకట్టిన విషయం తెలిసిందే. సురక్ష ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎం.శివకుమార్ నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పకడ్బందీగా పూర్తి చేసుకొని ఈమధ్యే సెట్స్‌పైకి వెళ్ళింది.
ఇక ఇప్పటివరకూ ఈ సినిమా టైటిల్ విషయమై రకరకాల పేర్లు వినిపించగా, చివరకు సినిమా యూనిట్ ‘శౌర్య’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసింది. ఓ సరికొత్త స్టోరీలైన్‌తో రూపొందనున్న ఈ సినిమాకు శౌర్య అనే టైటిల్ అన్ని విధాలా సరైన టైటిల్ అని దర్శక నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం హైద్రాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది. మనోజ్ సరసన రెజీనా హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాకు గోపీ మోహన్ స్క్రిప్ట్ సమకూర్చారు. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

