
నట సింహం సందమూరి బాలకృష్ణ తన ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే ‘డిక్టేటర్’ అనే టైటిల్ తో తన 99వ సినిమా చేస్తున్న సంగతి ఇదివరకే తెలియజేశాం. ఇటీవలే మేజర్ యూరప్ షెడ్యూల్ ని పూర్తి చేసుకువచ్చిన ఈ చిత్ర టీం లేటెస్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ లో మొదలు పెట్టారు. ఈ చిత్ర టీం నుంచి తెలుసుకున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం బాలకృష్ణ పై ఇంటర్వల్ బ్లాక్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో వచ్చే ఓ పవఫుల్ యాక్షన్ ఎపిసోడ్ ని ప్రసతుతం షూట్ చేస్తున్నారు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ గా ఉంటూనే సరికొత్తగా ఉండేలా యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేసారు.
శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇక కంటిన్యూగా హైదరాబాద్ లోనే జరగనుంది. శ్రీవాస్ కంటిన్యూ షెడ్యూల్స్ తో సినిమాని డిసెంబర్ కల్లా ఫినిష్ చేసి 2016 సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమాని రిలీజ్ చెయ్యడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు. బాలకృష్ణ సరసనఅంజలి , సోనాల్ చౌహాన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి కథని అందించారు. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సాంగ్ కి సూపర్బ్స్ రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించానున్న ఈ సినిమాని శ్రీవాస్ – ఎరోస్ ఇంటర్నేషనల్ వారు కలిసి నిర్మిస్తున్నారు. తమన్ మొదటిసారి బాలకృష్ణ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు.

