పవర్ స్టార్ రిలీజ్ చేయనున్న నిఖిల్ మూవీ ట్రైలర్

పవర్ స్టార్ రిలీజ్ చేయనున్న నిఖిల్ మూవీ ట్రైలర్

Published on Oct 13, 2015 1:49 PM IST

pawan-and-nikhil

హ్యాట్రిక్ హిట్స్‌తో జోరుమీదున్న యంగ్ హీరో నిఖిల్ హీరోగా నటిస్తున్న క్రైమ్ కామెడీ మూవీ ‘శంకరాభరణం’. ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాణంలో రానున్న ఈ సినిమాలో నందిత హీరోయిన్ గా కనిపించనుంది. ఇటీవలే ఈ చిత్ర టీం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ మొత్తాన్ని ఫినిష్ చేసి గుమ్మడికాయ కొట్టేసింది. దాంతో ఈ చిత్ర టీం ఫస్ట్ ట్రైలర్ ని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేసుకుంది. అందులో భాగంగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమాతో పాటు అక్టోబర్ 16న థియేటర్స్ లో ఈ ట్రైలర్ ని వేయడానికి ప్లాన్ చేసారు.

ఇప్పుడ దానికంటే రెండు రోజుల ముందే ఈ సినిమా అధికారికంగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. అది కూడా టాలీవుడ్ మోస్ట్ సెన్సేషన్ హీరో చేతుల మీదుగా రిలీజ్ చెయ్యడానికి సర్వం సిద్దం చేసారు. అతను మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రేపు ఉదయం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా శంకరాభరణం ట్రైలర్ ని లాంచ్ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ ట్రైలర్ ని లాంచ్ చేయడానికి ఒప్పుకోవడంతో కోన వెంకట్, నిఖిల్ లు చాలా హ్యాపీగా ఉన్నారు. ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో మంచి ఆసక్తి రేకెత్తిస్తోంది. దీపావళి కానుకగా నవంబర్ నెలలో విడుదల కానున్న ఈ సినిమా ఆడియోని ఈ నెల్లోనే రిలీజ్ చేయనున్నారు.

తాజా వార్తలు