‘శంకరాభరణం’ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్‌కు రెడీ!

‘శంకరాభరణం’ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్‌కు రెడీ!

Published on Oct 27, 2015 2:51 PM IST

Shankarabharanam-
హ్యాట్రిక్ హిట్స్‌తో తెలుగులో మంచి ఫామ్‌లో ఉన్న హీరో నిఖిల్ తాజాగా ‘శంకరాభరణం’ సినిమాతో మెప్పించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు ఉదయ్ నందనవనం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది. ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ ఈ సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే మాటలు కూడా అందించడంతో ఈ సినిమా మొదట్నుంచే ఆసక్తికరంగా కనిపిస్తూ వచ్చింది. ఇక ఈ మధ్యే విడుదలైన టీజర్ ఈ సినిమా ఆసక్తిని రెట్టింపు చేసింది.

శంకరాభరణం సినిమాకు మొదట్నుంచీ కనిపిస్తూ వచ్చిన ఆసక్తిని సినిమా రిలీజ్‌ లోపు క్రేజ్‌గా మార్చుకోవడానికి టీమ్ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. పవన్ కళ్యాణ్‌తో టీజర్ రిలీజ్ చేయించడం, సరికొత్త పద్ధతుల్లో ప్రచారాలు నిర్వహించడం ఇవన్నీ ఈ సినిమాకు క్రేజ్ తెచ్చిపెడుతున్నాయి. ఇక ఈ సాయంత్రం శంకరాభరణం సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ సాంగ్ ఒకటి విడుదల కానుంది. ఈ సాంగ్‌ను ఎవరు విడుదల చేయనున్నారనే విషయాన్ని టీమ్ సీక్రెట్‌గా ఉంచుతోంది. ఓ సరికొత్త క్రైమ్ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో నిఖిల్ సరసన నందిత హీరోయిన్‌గా నటించారు.

తాజా వార్తలు