‘విశ్వంభర’ రిలీజ్ : మెగాస్టార్ ఆ డేట్‌పై కన్నేశాడా..?

‘విశ్వంభర’ రిలీజ్ : మెగాస్టార్ ఆ డేట్‌పై కన్నేశాడా..?

Published on May 11, 2026 6:59 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో-ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ భారీ స్థాయి VFX పనుల కారణంగా కొంత ఆలస్యమవుతోంది. తొలుత జూలైలో విడుదల చేయాలనుకున్నా, ఇప్పుడు ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఆ వీకెండ్‌లో పెద్దగా పోటీ లేకపోవడం సినిమాకు ప్లస్ కానుంది.

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను దర్శకుడు వశిష్ట కొట్టిపారేశాడు. ప్రస్తుతం డిజిటల్ డీల్‌ను క్లోజ్ చేసే పనిలో ఉన్న యూవీ క్రియేషన్స్, త్వరలోనే అఫీషియల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి హరి గౌర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారు.

చిరంజీవి, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్ట్ 15 విడుదలకు గ్రీన్ సిగ్నల్ వస్తే, మెగా అభిమానులకు సోలోగా బాక్సాఫీస్ వద్ద పండగ ఖాయమని చెప్పవచ్చు.

తాజా వార్తలు