
ఈ ఏడాది వచ్చిన బాహుబలి సినిమాతో ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రానా. బాహుబలి 2 కి ఇంకాస్త సమయం పట్టేలా ఉండడంతో రానా సోలో హీరోగా 2 సినిమాలు చేయడానికి సిద్దమయ్యాడు. అందులో ఒకటే ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్ పై రాని నేవీ, సబ్ మెరైన్ కాన్సెప్ట్ మీద రానున్న సినిమా. 1971 లో ఇండియా – పాకిస్తాన్ మధ్య జరిగిన వార్ లో పాకిస్తాన్ వాళ్ళు విశాఖపట్నం లోని పిఎన్ఎస్ ఘజి సబ్ మెరైన్ పై దాడి చేసి అది సముద్రంలో మునిగిపోయేలా చేసిన సంఘటన ఆధారంగా సంకల్ప్ అనే రైటర్ ఈ కథని సిద్దం చేసాడు, అతనే ఈ సినిమా ద్వారా దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.
రానా నావికా అధికారిగా కనిపించనున్న ఈ సినిమాలో ఓ నెగటివ్ షెడ్ పాత్ర చేయడానికి బాలీవుడ్ యాక్టర్ ని ఫైనలైజ్ చేసారు. ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాల్లో కలిస్పించి, ఆఅల్గె ఫేమస్ బాలీవుడ్ 24 సీరీస్ లో నటిస్తున్న రాహుల్ సింగ్ ని ఈ సినిమాలో ఓ మెయిన్ రోల్ కోసం సెలక్ట్ చేసారు. అలాగే ఈ సినిమాలో రానాకి జోడీగా సమంతని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మించనున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని శరవేగంగా ఫినిష్ చేస్తున్న ఈ సినిమాని నవంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకి ‘ఘజి’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.

