రజినీ ‘కబాలి’లో భారీ ఫైర్ సీక్వెన్స్.!

రజినీ ‘కబాలి’లో భారీ ఫైర్ సీక్వెన్స్.!

Published on Oct 27, 2015 7:31 PM IST

kabali
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి వస్తున్న తదుపరి సినిమా ‘కబాలి’. ఒకప్పటి సౌత్ చెన్నై రియల్ లైఫ్ డాన్ కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మలేషియాలో ఓ మేజర్ షెడ్యూల్ ని స్టార్ట్ చేసింది. కొద్ది రోజుల క్రితమే ఈ చిత్ర టీం చెన్నైలో వేసిన ఓ భారీ సెట్లో మేజర్ ఎపిసోడ్స్ షూటింగ్ ని ఫినిష్ చేసింది. ఈ చిత్ర టీం నుంచి తెలుసుకున్న సమాచారం ప్రకారం మీకో మంచి న్యూస్ ని తెలియజేస్తున్నాం. రజినీకాంత్ ఈ వయసులో కూడా అభిమానులను మెప్పించడం కోసం ఈ సినిమాలో ఓ భారీ ఫైర్ యాక్షన్ సీక్వెన్స్ చేసాడట.

అసలు విషయం ఏమిటంటే.. కబాలి సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రజినీకాంత్ యంగ్ గెటప్ లో కనిపిస్తాడట. ఆ టైంలో తన మనుషులను 200 మందిని బంధింస్తే వారిని కాపాడటం కోసం వెళ్ళే సందర్భంలో రజినీకాంత్ పై ఓ భారీ ఫైర్ యాక్షన్ ఎపిసోడ్ ని డిజైన్ చేసాడు డైరెక్టర్ రంజిత్. రజినీకాంత్ ఏ మాత్రం తగ్గకుండా రిస్క్ తో కూడకున్న ఆ ఫైర్ ఎపిసోడ్ ని ఫినిష్ చేసాడు. ఇటీవలే షూట్ చేసిన ఈ ఎపిసోడ్ చాలా బాగా వచ్చిందని, సినిమాకి అదో పెద్ద హైలైట్ అవుతుందని అంటున్నారు. రజినీకాంత్ సరసన రాధిక ఆప్టేని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జెడి చక్రవర్తి, ధన్సిక ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పిఎ రంజిత్ ఈ సినిమాకి డైరెక్టర్.

తాజా వార్తలు