
ఈ ఏడాది వరుసగా బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ అందుకున్న భామ అనుష్క. అలా అని అవి రెండు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాదు, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పీరియాడిక్ ఫిల్మ్స్ కావడం విశేషం. ఆ సినిమాలే బాహుబలి మరియు రుద్రమదేవి. ఈ సినిమాల విజయంతో చాలా ఆనందంగా ఉన్న అనుష్క త్వరలోనే ‘సైజ్ జీరో’ అనే మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే చాలా రోజులు నుంచీ అనుకుంటున్న మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాకి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట..
ఇక విషయంలోకి వెళితే పిల్ల జమిందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో ‘భాగ్ మతీ’ అనే సినిమాని అనుకున్నారు. కానీ ఆ సినిమాకి అనుష్క అప్పట్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం ఈ చిత్రాన్ని నిర్మించే యువి క్రియేషన్స్ వారి సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం రీసెంట్ గా అనుష్క ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అన్నీ ఫైనల్ అయితే వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా అధికారికంగా లాంచ్ అవుతుందని అంటున్నారు. సైజ్ జీరో కోసం బరువు పెరిగిన అనుష్క ప్రస్తుతం బాహుబలి 2 కోసం సన్నబడే పనిలో ఉంది.

