యుఎస్ లో హాఫ్ మిలియన్ మార్క్ కొట్టిన కంచె

యుఎస్ లో హాఫ్ మిలియన్ మార్క్ కొట్టిన కంచె

Published on Nov 2, 2015 10:37 AM IST

Kanche
మునుపెన్నడూ వెండితెరపై చూడని కథాంశంతో వచ్చి, తెలుగు సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించిన క్రేజీ సినిమా ‘కంచె’. ఈ సినిమా దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై అటు విమర్శకుల నుంచి, ఇటు తెలుగు ప్రేక్షకుల నుంచి మన్ననలు పొందింది. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ లాంటి సినిమాలతో తెలుగులో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు క్రిష్ కంచె సినిమాను రెండో ప్రపంచయుద్ధ నేపధ్యంలో ఓ ప్రేమకథను జోడించి తెరకెక్కించారు. ఈ బ్యాక్ డ్రాప్ ఈ సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయ్యింది. మునుపెన్నడూ చూడని నేపధ్యం కావున ఆడియన్స్ ఈ సినిమాని చూడటానికి బాగా ఇష్టపడుతున్నారు.

కంచె సినిమాకి ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యుఎస్ లో కూడా బ్రహ్మరధం పట్టారు. దాంతో ఈ సినిమా సెకండ్ వీకెండ్ ముగిసే సమయానికి అనగా మొదటి 10 రోజుల్లో హాల్ఫ్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. మాకు అందిన యుఎస్ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం మొదటి 11 రోజుల్లో కంచె సినిమా $501,925 చేసింది. అనగా ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 3.25 కోట్లు. వరుణ్ తేజ్ రెండవ సినిమాతో యుఎస్ లో మంచి కలెక్షన్స్ సాధించి అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలను తెచ్చి పెట్టాడు. అబ్బురపరిచే వరల్డ్ వార్ II సీన్స్, వరుణ్ తేజ్ పెర్ఫార్మన్స్, సాయి మాధవ్ బుర్రా రాసిన కదిలించే డైలాగ్స్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు 1940 కంటెంట్ ని గా ప్రెజంట్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది.

తాజా వార్తలు