తనపై తీసిన సినిమా చూడనున్న రజినీకాంత్

తనపై తీసిన సినిమా చూడనున్న రజినీకాంత్

Published on Nov 2, 2015 12:41 PM IST

Rajini-kanth
తమిళనాడుతో పాటు సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లోనూ సూపర్బ్ క్రేజ్ ఉన్న స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయనకి ఒక్క సౌత్ లోనే కాకుండా నార్త్ ఇండియాలోనూ అలాగే జపాన్ లో కూడా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఆయన ప్రతి సినిమా అన్ని భాషల్లోనూ రిలీజ్ అవుతూ ఉంటుంది. రజినీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలుసుకున్న రింకు కల్సి అనే డచ్ ఫిల్మ్ మేకర్ ఓ డాక్యుమెంటరీ చేసాడు. దాని పేరే ‘ఫర్ ది లవ్ ఆఫ్ అ మాన్’. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ పలు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడుతోంది.

ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న మామి ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ఈ సినిమాని వేసారు. షో అనంతరం రింకు కల్సి మీడియాతో మాట్లాడుతూ.. ‘త్వరలోనే నేను సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఈ సినిమాని చూపించనున్నాను. అలాగే ఇటీవలే రజినీ కుమార్తె ఐశ్వర్య ధనుష్ కూడా ఈ సినిమాని చూసింది. ఆమె కూడా త్వరలోనే రజినీ ఈ సినిమా చూస్తాడని తెలిపిందని’ అన్నాడు. మనసుకు హత్తుకునేలా, చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్న డాక్యుమెంటరీ లో రజినీ సూపర్ స్టార్ గా ఎదిగిన లైఫ్ ని మరియు అభిమానులు ఎందుకు ఆయన్ని దేవుడిగా ఆరాధిస్తున్నారు అన్న పాయింట్స్ ని చూపించారు.

తాజా వార్తలు