
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. వరుసగా హిట్ సినిమాలతో మెప్పిస్తూ తెలుగులో టాప్ హీరోల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న స్టార్. ప్రస్తుతం దర్శకుడు భోయపాటి శ్రీనుతో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించబోయే సినిమాకు సంబంధించి ఇప్పట్నుంచే ఓ ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి వస్తోంది. ’13 బీ’, ‘ఇష్క్’, ‘మనం’.. ఇలా సరికొత్త కథాంశాలతో రూపొందిన సినిమాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ తదుపరి సినిమా ఉండనుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
విక్రమ్ కుమార్ ప్రస్తుతం సూర్య హీరోగా 24 పేరుతో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి సీజన్‌కు ఈ సినిమా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే బన్నీ సినిమా కోసం విక్రమ్ కుమార్ సన్నాహాలు మొదలుపెట్టనున్నారట. సమ్మర్ తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందని సమాచారం. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఇంకా డిస్కషన్ స్టేజ్‌లోనే ఉండడంతో ఈ కాంబినేషన్‌పై ఇంకా సరైన స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళుతోన్న బన్నీ, విక్రం కుమార్ల కాంబినేషన్ అంటే వినడానికే ఎంతో ఆసక్తికరంగా ఉందనడంలో అతిశయోక్తి లేదు.

