బాలీవుడ్‌కు వెళుతోన్న మరో తెలుగు హీరో!

బాలీవుడ్‌కు వెళుతోన్న మరో తెలుగు హీరో!

Published on Nov 12, 2015 2:30 PM IST

navadeep
తెలుగులో ‘చందమామ’, ‘ఆర్య 2’ లాంటి సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న యువహీరో నవదీప్ త్వరలోనే బాలీవుడ్ తెరపై కూడా కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ నటిస్తోన్న ‘అజర్’ అనే సినిమాలో నవదీప్ ఓ కీలక పాత్ర పోషించనున్నారు. టోనీ డిసౌజా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఏక్తాకపూర్ నిర్మిస్తున్నారు. ఇక నవదీప్ చేయనున్న పాత్ర కోసం పలువురు ఇతర నటుల ప్రొఫైల్స్ కూడా పరిశీలించిన టోనీ, చివరకు నవదీప్‌ అయితే ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాడని నవదీప్‌ను సంప్రదించారు.

భారత క్రికెట్ టీమ్‌కు కెప్టెన్‌గా విశిష్ట సేవలు అందించి ఘనత చాటిన అజారుద్దిన్ జీవిత కథ ఆధారంగా అజర్ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైద్రాబాద్‌లో జరుగుతోంది. మరో వారం రోజుల్లో నవదీప్, ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవదీప్, తాజాగా బాలీవుడ్‌కూ పరిచయం కానుండడం విశేషంగానే చెప్పుకోవచ్చు. 2016 సమ్మర్ సీజన్‌లో ‘అజర్’ సినిమా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు