‘పెద్ది’లో గుండె ముక్కలు చేసే సీక్వెన్స్ లు ఎన్నో!

‘పెద్ది’లో గుండె ముక్కలు చేసే సీక్వెన్స్ లు ఎన్నో!

Published on May 12, 2026 3:01 PM IST

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర టెక్నీషియన్స్ రత్నవేలు, అవినాష్ కొల్ల లాంటి వారు ఇస్తున్న ఇంటర్వ్యూ లలో పెద్ది సినిమా కంటెంట్ ని నెక్స్ట్ లెవెల్లో లేపుతున్నారు.

అయితే ఈ సినిమా విషయంలో ఇంకా మొదలు కాక ముందే సినిమా స్క్రిప్ట్ ని విజయ్ సేతుపతి నుంచి చాలా మంది ఓ రేంజ్ లో హైప్ ఇచ్చి వదిలారు. ఆ రేంజ్ లో ఇంటెన్స్ డ్రామా ఇందులో దాగి ఉందని చెబుతున్నారు. ఇటీవల ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల ఈ సినిమా స్క్రిప్ట్ నరేషన్ లో ఎమోషనల్ గా ఎంతో కదిలిపోయాను అని చెబుతున్నారు.

తన కెరీర్ మొత్తంలో ఎంతో ట్రామాకి గురి చేసిన సబ్జెక్టు ఇది అని పెద్ది కోసం చెప్పారు. ఇక ఇలాంటి సాలిడ్ ఎమోషన్స్ తో కూడిన సీక్వెన్స్ లు పెద్ది లో ఎక్కువే ఉంటాయట. మరి వాటిని బుచ్చిబాబు ఎలా రక్తి కట్టించాడో తెలియాలి అంటే ఈ జూన్ 4 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు