నిర్మాతగా మారుతున్న మరో స్టార్ హీరో?

నిర్మాతగా మారుతున్న మరో స్టార్ హీరో?

Published on Nov 14, 2015 1:20 PM IST

allu-arjun
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని యంగ్ స్టార్ హీరోస్ ఈ మధ్య హీరో అనే దానికే పరిమితం కాకుండా తమకు ఇష్టం ఉన్న వేరే ఫీల్డ్స్ లో కూడా ఎంటర్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం యంగ్ హీరోస్ ఎక్కువగా ఆసక్తి చూపుతున్న ఫీల్డ్ ప్రొడక్షన్ సైడ్ కావడం విశేషం. రీసెంట్ గా పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు తమ ప్రొడక్షన్ హౌస్ లను లాంచ్ చేస్తే త్వరలోనే రామ్ చరణ్ కూడా ప్రొడక్షన్ హౌస్ ని లాంచ్ చేయనున్నారు. ఇప్పుడు వీరి జాబితాలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరనున్నాడు.

కానీ అల్లు అర్జున్ ఓ కన్నడ సినిమా ద్వారా నిర్మాణ రంగంలో తన పేరుని వేసుకోనున్నాడని సమాచారం. ఇక విషయంలోకి వెళితే.. రీసెంట్ గా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమాని కన్నడ రీమేక్ రైట్స్ ని రాక్ లైన్ వెంకటేష్ కొనుక్కున్నాడు. కన్నడ వెర్షన్ కి ఒక పార్టనర్ గా అల్లు అరవింద్ వ్యవహరించనున్నాడు. కానీ కన్నడలో అల్లు అర్జున్ కి మంచి పేరు ఉండడంతో అల్లు అర్జున్ పేరుని టైటిల్ కార్డ్స్ లో వేస్తె సినిమాకి బాగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నారట. దీని ప్రకారం అల్లు అర్జున్ కూడా నిర్మాణ రంగంలో దిగుతున్నాడని చెప్పవచ్చు. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

తాజా వార్తలు