విష్ణు, రాజ్ తరుణ్‌ల మల్టీస్టారర్!

విష్ణు, రాజ్ తరుణ్‌ల మల్టీస్టారర్!

Published on Nov 15, 2015 3:51 PM IST

vishnu-raj-tarun
వరుస హిట్స్‌తో జోరు మీదున యువ హీరో రాజ్ తరుణ్ త్వరలో ప్రస్తుతం తన తాజా సినిమా కుమారి 21 ఎఫ్ కోసం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అంతటా పాజిటివ్ బజ్ ఉన్న ఈ సినిమా తనకు హ్యాట్రిక్ హిట్ తెచ్చిపెడుతుందన్న నమ్మకంతో రాజ్ తరుణ్ ఉన్నారు. ఇక ఇదిలా ఉండగానే రాజ్ తరుణ్ తన తదుపరి సినిమాలను కూడా లైన్లో పెట్టి దూసుకుపోతున్నారు. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మతో ఓ సైలెంట్ మూవీ ప్లాన్ చేసిన ఈ హీరో, మరో మల్టిస్టారర్ సినిమానూ ఒప్పుకున్నారు.

విష్ణు హీరోగా రూపొందనున్న ఓ సినిమాలో రాజ్ తరుణ్ మరో హీరోగా నటించేందుకు ఓకే చేశారు. ఓ పంజాబీ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తారు. ఇక ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మించనున్నారు. పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో విష్ణు-రాజ్ తరుణ్‌ల కాంబినేషన్ హైలైట్‌గా నిలిచేలా ఉండనుందని తెలుస్తోంది.

తాజా వార్తలు