కోలీవుడ్ హీరో కార్తీ, ‘మ్యాడ్’ ఫేమ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాను ఇటీవల అధికారికంగా ప్రారంభించారు కూడా. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో మరో డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కూడా వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ‘మిరాయ్’ వంటి చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్, ఇప్పుడు కార్తీ సినిమా కోసం మరోసారి సినిమాటోగ్రాఫర్‌గా మారనున్నాడు. నిజానికి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చందూ మొండేటి దర్శకత్వంలో రావలసిన ‘వాయుపుత్ర’ అనే యానిమేషన్ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని వర్క్ చేయాల్సి ఉంది. అయితే బడ్జెట్ కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి వాయిదా పడటంతో, నిర్మాత నాగవంశీ ఆయన్ని కార్తీ సినిమాకు షిఫ్ట్ చేశారు.
టెక్నికల్‌గా మంచి పట్టున్న కార్తీక్ ఘట్టమనేని ఈ ప్రాజెక్ట్‌లో చేరడం కళ్యాణ్ శంకర్ టీమ్‌కు పెద్ద బూస్ట్ అని చెప్పవచ్చు. ఇప్పటికే ‘హిట్’ ఫ్రాంచైజీ లో భాగమైన కార్తీ, ఈ స్ట్రెయిట్ తెలుగు సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.


