పైరేట్స్ నేపధ్యంలో రానున్న టెక్నికల్ థ్రిల్లర్ ‘ఐతే 2.0’

పైరేట్స్ నేపధ్యంలో రానున్న టెక్నికల్ థ్రిల్లర్ ‘ఐతే 2.0’

Published on Nov 16, 2015 6:00 AM IST

Aithe-2.0
కమర్షియల్ సినిమా అనే ఫార్మాట్ ని పక్కన పెట్టి ఓ సరికొత్త ఫార్మాట్ ని తెలుగు తెరకు పరిచయం చేయడమే కాకుండా బాక్స్ ఆఫీసు వద్ద కూడా పెద్ద హిట్ అయిన సినిమా ‘ఐతే’. ప్రస్తుతం యంగ్ స్టర్స్ ఈ టైటిల్ ని ఉపయోగించుకుంటూ చేస్తున్న థ్రిల్లర్ మూవీ ‘ఐతే 2.0’. గతంలో ‘ఋషి’, ‘ఆంధ్రాపోరి’ సినిమాలకు దర్శకత్వం వహించిన రాజ్ మదిరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నలుగురు కుర్రాళ్ళ చుట్టూ తిరుగుతుంది. ఇంద్రనీల్ సేన్ మెయిన్ హీరోగా ఉన్న ఈ సినిమాలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ జర షా హీరోయిన్ గా కనిపించనుంది.

వీరితో పాటు నూతన నటీనటులైన అభిషేక్, నీరజ్, మృణాల్, కర్తవ్య శర్మ, మృదాంజలి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇంటర్నెట్ మరియు టెక్నాలజీల వాళ్ళ కలిగే నష్టాలను, మోసాల చుట్టూ తిరిగే ఈ కథని టెక్నికల్ థ్రిల్లర్ గా రూపొందించారు. ఆకలి, ఆశ, ఆక్రోశం కలిగిన నలుగురు నిరుద్యోగ గ్రాడ్యువేట్స్ పైరేట్స్ గా మారి ఏం చేసారు అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. అరుణ్ చిలువేరు మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని కె. విజయరామరాజు – హేమంత్ వల్లపురెడ్డి కలిసి నిర్మించనున్నారు. ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది.

తాజా వార్తలు