
తమిళ్ తో పాటు తెలుగులో కూడా స్టార్డం ఉన్న యంగ్ హీరో సూర్య, విభిన్న తరహా సినిమాలు చేసే విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ’24’ అనే ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సూర్య తన సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాలో సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ముందుగా ఈ సినిమాని సంక్రాంతి రిలీజ్ అనుకొని ఆ తర్వాత సమ్మర్ కి పోస్ట్ పోన్ చేసారు.
కానీ మళ్ళీ సంక్రాంతికి రావాలని ఫిక్స్ అయ్యారు. దానికి తగ్గట్టుగానే సహ్రవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని ఫినిష్ చేస్తున్నారు. కానీ తాజాగా మళ్ళీ సూర్య అండ్ టీం సంక్రాంతి సీజన్ కి వద్దు సంమర్లోనే రావడం బెటర్ అని సినిమాని పోస్ట్ పోన్ చేసారు. ఈ సారి సంక్రాంతి నుండి తప్పుకోవడానికి ప్రధాన కారణం రజినీకాంత్ నటిస్తున్న ‘కబాలి’ సినిమా మరియు విజయ్ 59వ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుండడం. ఆ రెండింటి మధ్యలో ఎందుకని సూర్య 24 ని వాయిదా వేసాడు. ఈ సినిమా తెలుగు మూవీ రైట్స్ ని నితిన్ దక్కించుకున్నాడు. ముంబై నేపథ్యంలో నడిచే ఈ సినిమా ఒక సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రానుంది.

