
సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ ప్రుకి కేవలం సౌత్ ఇండియాలోనే కాదు, నార్త్ ఇండియా, జపాన్, సౌత్ ఆసియాలతో పాటు వరల్డ్ వైడ్ గా అభిమానులు ఉన్నారు. ఆయన సినిమా వస్తుందన్నా, ఆయన పుట్టిన రోజు వస్తుందన్నా ఆడియన్స్ పండగ చేసుకుంటారు. రజినీకాంత్ బర్త్ డే ని తమ పుట్టిన రోజులా జరుపుకోవడమే కాకుండా అభిమానులు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు. ఇప్పుడు ఇది ఎందుకు అంటే రజినీకాంత్ బర్త్ డేకి ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది, దాంతో అభిమానులు పలు కార్యక్రమాలకు సన్నాహాలు చేసుకుంటూ ఉంటే రజినీ మాత్రం అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్దమవుతున్నాడు.
మొదటిది.. తన కెరీర్లోనే మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ రోబోకి సీక్వెల్ గా శంకర్ డైరెక్షన్ లో చేయనున్న రోబో 2ని అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఇక రెండవది.. రజినీకాంత్ నటిస్తున్న ‘కబాలి’ సినిమాకి సంబందించిన థ్రిల్లింగ్ పోస్టర్స్ ని రిలీజ్ చేయనున్నారు. సినిమా స్టార్టింగ్ అప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్లే సూపర్బ్ క్రేజ్ ని తెచ్చుకున్నాయి. రజినీ బర్త్ డేకి రిలీజ్ చేసే పోస్టర్స్ అంతకన్నా క్రేజ్ ని క్రియేట్ చేసేలా ఉంటాయని సమాచారం. డిసెంబర్ 2వ వారం కల్లా రజినీకాంత్ కబాలి సినిమా షూటింగ్ ని ఫినిష్ చేయనున్నాడు. అలాగే డిసెంబర్ 18 నుంచి ‘రోబో 2’ సినిమాని షూట్ ని ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు.

