విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న జంటగా నటించిన ప్రకటనలు సోషల్ మీడియాలో సరికొత్త ప్రపంచ రికార్డులను సృష్టిస్తున్నాయి. ఈ ‘విరోష్’ జోడికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విపరీతమైన క్రేజ్ కారణంగా, వీరు ఇటీవల చేసిన ‘ఎయిర్ బీఎన్‌బీ’ (Airbnb) కపుల్ యాడ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 9.1 మిలియన్లకు పైగా లైక్స్ లభించాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యాడ్‌కు వచ్చిన రెండో అత్యధిక లైక్స్‌గా ఇది రికార్డు సృష్టించింది.
అంతేకాకుండా, ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక లైక్స్ సాధించిన మొదటి ప్రకటన కూడా వీరిదే కావడం విశేషం. గతంలో వీరు కలిసి నటించిన ‘మాన్యవర్’ వెడ్డింగ్ యాడ్ పోస్ట్ 11.5 మిలియన్లకు పైగా లైక్స్‌తో గ్లోబల్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఈ పోస్ట్‌కు ఏకంగా 104 మిలియన్ల వ్యూస్ దక్కడం మరో విశేషం. ఫుట్‌బాల్ దిగ్గజాలు మెస్సి మరియు రొనాల్డో కలిసి చేసిన ‘లూయిస్ వ్యూటన్’ యాడ్ కంటే కూడా విరోష్ యాడ్‌కే ఎక్కువ లైక్స్ రావడం గమనార్హం.
ప్రస్తుతం సోషల్ మీడియా అడ్వర్టైజింగ్ రంగంలో తమదైన ముద్ర వేస్తున్న ఈ జంట, త్వరలో వెండితెరపై కూడా సందడి చేయబోతున్నారు. విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న కలిసి నటిస్తున్న ‘రణబాలి’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఈ హిట్ జోడి బాక్సాఫీస్ వద్ద కూడా మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.


