చెన్నై బాధితుల సహాయార్థం బన్నీ విరాళం

చెన్నై బాధితుల సహాయార్థం బన్నీ విరాళం

Published on Dec 2, 2015 8:23 PM IST

allu-arjun
చెన్నై నగరాన్ని గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో కురిసిన వర్షాలు చెన్నై నగరాన్ని అస్థవ్యస్థం చేసేశాయి. అక్కడి జనజీవనం పూర్తిగా స్థంబించిన నేపథ్యంలో వారికోసం ప్రభుత్వంతో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. ఇక ఈ సహాయ కార్యక్రమాలకు అండగా మేమున్నాం అంటూ తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ హీరోలు కూడా ముందుకు వచ్చారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వరద బాధితుల సహాయార్థం 25 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి ఈ మొత్తాన్ని బన్నీ అందించనున్నారు. ఇక అల్లు అర్జున్‌తో పాటు మహేష్, ఎన్టీఆర్, వరుణ్ తేజ్, రవితేజ.. ఇలా స్టార్ హీరోలంతా ముందుకు వచ్చి బాధితులకు అండగా నిలబడడం ఆహ్వానించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు.

తాజా వార్తలు