
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా దర్శకుడు సంపత్ నంది ‘బెంగాల్ టైగర్’ అనే ఓ మాస్ కమర్షియల్ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. భారీ ప్రమోషన్స్‌తో క్రేజీ ప్రాజెక్టుగా ప్రచారం పొందిన ఈ సినిమా గత గురువారం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైంది. ‘ఏమైంది ఈ వేళ’, ‘రచ్చ’ సినిమాలతో మెప్పించిన సంపత్ నంది మూడో ప్రయత్నానికి కూడా మొదటిరోజు నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రవితేజ మార్క్ కామెడీకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు మొదట్నుంచీ కనిపించిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ థియేటర్లలో సినిమాను విడుదల చేశారు.
ఇక ఈ నేపథ్యంలోనే సినిమాకు పాజిటివ్ టాక్ కూడా రావడంతో మొదటి వీకెండ్ ‘బెంగాల్ టైగర్’ మంచి కలెక్షన్లు వసూలు చేసింది. నైజాం ఏరియాలో మొదటి రోజు 2 కోట్ల 17లక్షల షేర్ వసూలు చేసిన సినిమా, వీకెండ్ ముగిసేసరికి 5.92 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. నాలుగు రోజుల లాంగ్ వీకెండ్‌ను ప్లాన్ చేసుక్ కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, రాశి ఖన్నాల అందచందాలు సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచాయి. చేసుకొని విడుదలైన ఈ సినిమాకు ఈ ప్లాన్ బాగా ఉపయోగపడి మొదటివారాంతం మంచి కలెక్షన్లను తెచ్చిపెట్టగలిగింది. ఇక లాంగ్ రన్‌లో నైజాం ఏరియాలో ఈ సినిమా 10 కోట్ల మార్క్ టచ్ చేస్తుందని ఓ అంచనా.

