సినీ రచయిత కాశీ విశ్వనాథ్ కన్నుమూత

సినీ రచయిత కాశీ విశ్వనాథ్ కన్నుమూత

Published on Dec 22, 2015 4:30 PM IST

kaasi-viswanath
తెలుగు సినీ పరిశ్రమలో రచయితగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కాశీ విశ్వనాథ్ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళుతోన్న రైలులో ప్రయాణిస్తోన్న ఆయన అకస్మాత్తుగా గుండెపోటుతో ఖమ్మం జిల్లా సమీపంలో రైలులోనే మరణించారు. ఖమ్మం పోలీసులు ఆయన భౌతికకాయాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

తెలుగులో దాదాపు 70కి పైగా సినిమాలకు రచయితగా పనిచేసిన ఆయన గత కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ కొద్దిసేపటిక్రితం కన్నుమూశారు. విశ్వనాథ్ మృతిపట్ల సినీ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది. ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 123తెలుగు తరపున సంతాపం ప్రకటిస్తున్నాం.

తాజా వార్తలు