‘నాన్నకు ప్రేమతో’ కోసం భారీ ప్రమోషన్ ప్లానింగ్

‘నాన్నకు ప్రేమతో’ కోసం భారీ ప్రమోషన్ ప్లానింగ్

Published on Jan 6, 2016 11:16 AM IST

nannaku-prematho1
‘నాన్నకు ప్రేమతో’ – యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన ఈ 25వ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి అందరికీ తెలిసిందే.. నిన్నటితో షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చివరి దశలో ఉంది. మరో రెండు రోజుల్లో అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకొని సెన్సార్ కి కూడా వెళ్లనుంది. సుకుమార్ ప్రస్తుతం ఈ సినిమాకి తుది మెరుగులు దిద్దుతున్నాడు. సినిమా రిలీజ్ కి ఇంకా ఒక్క వారం రోజులు మాత్రమే ఉండడంతో ఈ చిత్ర టీం భారీ ఎత్తున ప్రమోషన్స్ చేయడానికి ప్లాన్ చేసింది.

అందులో భాగంగానే ‘నాన్నకు ప్రేమతో’ టీం జనవరి 7వ తేదీ నుంచి కంటిన్యూగా పలు కార్యక్రమాల ద్వారా సినిమాని ప్రమోట్ చేయనున్నారు. ఎన్.టి.ఆర్ కూడా మునుపటిలా కాకుండా ముందుండి సినిమాని ప్రమోట్ చేయనున్నాడు. అలాగే వరుసగా టీవీఛానల్స్, పేపర్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ఈ చిత్ర బృందం వరుసగా స్పెషల్ ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వనున్నారు. ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, హేభ పటేల్ లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత.

తాజా వార్తలు