నాగ్ కి విలన్ గా జగపతి బాబు??

నాగ్ కి విలన్ గా జగపతి బాబు??

Published on Jan 24, 2016 6:02 PM IST

Jagapathi-Babu-and-nag
‘లెజెండ్’ సినిమాలో విలన్ రోల్ చేసిన తర్వాత నుంచి జపతో బాబు సూపర్ సక్సెస్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ప్రస్తుతం వరుసగా విభిన్న తరహా పాత్రలు, సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు జగపతి బాబు. రీసెంట్ గా వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించి ప్రేక్షకులను తన నటనతో సర్ప్రైజ్ చేసాడు. ఇదిలా ఉంటే తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కి జగపత్ బాబు సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ విషయంలోకి వెళితే..

రవితేజ – దిల్ రాజు – వేణు శ్రీరాం కాంబినేషన్ లో ‘ఎవడో ఒకడు’ అనే సినిమా ఉండాలి. ఆ సినిమా రవితేజ తప్పుకోవడం లన కాన్సల్ అయ్యింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ నాగార్జునకి పర్ఫెక్ట్ అని ఆయన్ని హీరోగా ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. అదిలా ఉండగా ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్ర కోసం జగపతి బాబును సెలక్ట్ చేసారు. ప్రస్తుతం ఆయనతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే నాగ్ – జగ్గు భాయ్ లు హీరో – విలన్ లుగా ఈ సినిమాకి సైన్ చేయనున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వీరిద్దరి కాంబినేషన్ సినిమాకి పెద్ద క్రేజ్ ని తీసుకువస్తుంది.

తాజా వార్తలు