
స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల తో వరుణ్ తేజ్ సినిమా చేయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాటిని ఒక నాయకిగా అనుకుంటున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఇంకో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా లో ఇంకో నాయకిగా రెజీనా కాసాండ్రా ను తీసుకోవాలని దర్శకుడు శ్రీను వైట్ల ఆమెను సంప్రదించినట్లు తెలిసింది. ఇంకా రెజీనా నుంచి ఎటువంటి హామీ రాకపోయినా రెజీనా ఈ సినిమాలో నటించే ఆవకాశం ఉన్నట్లు తెలిసింది.
‘ఆగడు’, ‘బ్రూస్ లీ’ లాంటి రెండు భారీ పరాజయాల తర్వాత మళ్ళీ ఓ బలమైన హిట్ కొట్టాలన్న ఆలోచనతో దర్శకుడు శ్రీనువైట్ల వరుణ్‌కు ఓ పకడ్బందీ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మించనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. దిల్ రాజు నిర్మిస్తున్న ‘ఫీల్ మై లవ్’ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. మిగతా వివరాలు త్వరలో తెలుస్తాయి.

