
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కి బాబీ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. తన రెండో సినిమాకే పవన్ కళ్యాణ్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు యాభై దేశాల్లో విడుదలైన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొట్టడమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటిరోజు దాదాపు 20.9 కోట్లు కలెక్ట్ చేసింది.
ఈ సందర్భంగా దర్శకుడు బాబీ ’పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ సత్తా చూపించినందుకు… ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అని తన ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. అంతేకాకుండా పవర్ స్టార్ శక్తికి, ప్రేమకు కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. వీటితో పాటు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మొదటిరోజు ఆంధ్రప్రదేశ్, నైజాం, అమెరికా లతో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ ని కూడా పోస్ట్ చేశాడు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో పవన్ కళ్యాణ్ సరసన కాజల్ అగర్వాల్ నటించగా శరద్ మరార్ ఈ సినిమాని నిర్మించిన విషయం తెలిసిందే.
We sincerely thank Telugu audience world wide for proving the stamina of PSPK ..Thank u Powerstar for ur energy & love ?
— bobby (@dirbobby) April 9, 2016
SGS 1st day share in AP/TG is 21cr.. Overseas 5 cr.. Rest of India 3cr..
— bobby (@dirbobby) April 9, 2016

