
’13 బి’, ‘ఇష్క్’, ‘మనం’ చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్, తమిళ సూపర్ స్టార్ సూర్యతో చేసిన ’24’ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తున్నది. సూర్య సొంత బ్యానర్‌పై నిర్మిచిన ప్రమోషన్స్ కోసం సూర్య అమెరికాలో పాల్గొన్న విషయం తెలిసిందే.
మాకు అందిన సమచారం ప్రకారం ఈ సినిమా తెలుగు, తమిళ్ వెర్షన్స్ కలిపి అమెరికాలో మొదటిరోజు $442,410 రాబట్టినట్లు తెలుస్తున్నది. ఈ సినిమాలో సూర్య పోషించిన మూడు పాత్రలకు మంచి స్పందన లభిస్తున్నా ప్రత్యేకంగా విలన్ పాత్ర పోషించిన ఆత్రేయ పాత్రకు విపరీతంగా ఆకట్టుకుంటున్నది. ఈ సినిమాలో సూర్య సరసన నిత్యామీనన్, సమంత నటించారు.

