
తెలుగు అమ్మాయి అయినా తమిళ్ లో హీరోయిన్ గా మంచి పేరు పొందింది శ్రీ దివ్య. విశాల్ కథానాయకుడిగా, శ్రీదివ్య కథానాయికగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ్ చిత్రం ’మరుదు’ ని తెలుగులో ‘రాయుడు’ గా తీసుకువస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు వెర్షన్ కి హీరోయిన్ శ్రీ దివ్య డబ్బింగ్ చెబుతున్నట్లు సమాచారం.
ఇటీవల విడుదల చేసిన ‘రాయుడు’ ఫస్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. విశాల్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై డిస్ట్రిబ్యూటర్ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా మే 11న ఈ చిత్రం పాటలను విడుదల చేసి మే 20న చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. పస్తుతం శ్రీ దివ్య జి.వి. ప్రకాష్ కుమార్ తో పెన్సిల్ అనే సినిమాలోనూ, కార్తీ తో కాష్మోరా అనే సినిమాలోనూ నటిస్తున్నది.

