
సౌతిండియాలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ సమంత నటించిన నాలుగు సినిమాలు రెండు నెలల తేడాలో రెండొందల కోట్లకు పైగా బిజినెస్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాల ప్రమోషన్స్‌తో పాటు, ఎన్టీఆర్ ‘జనతా గ్యారెజ్’ షూటింగ్‍తోనూ బిజీ బిజీగా గడిపేస్తోన్న సమంత, ఈ సాయంత్రం అభిమానుల కోసం ట్విట్టర్‌లో ఓ చాట్ సెషన్ నిర్వహించారు. గంటపాటు సాగిన ఈ చాట్ సెషన్‌లో అభిమానులడిగిన ప్రశ్నలకు సమంత తన స్టైల్లో సమాధానిలిస్తూ పోయారు.
‘ఎవరితో డ్యాన్స్ చేయడం కష్టంగా భావిస్తారూ?’ అన్న అర్థం వచ్చేలా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా, సమంత, జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్‌తో ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన సమంత, ఆయనతో సరిసమానంగా డ్యాన్స్ చేయడం అన్నది కష్టమని ఎప్పుడూ చెపుతూ వస్తుండేవారు. ఇక ఇప్పుడు ట్విట్టర్ చాట్ సెషన్‌లోనూ సమంత ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తూ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ‘జనతా గ్యారెజ్’ షూటింగ్‌లో ఎన్టీఆర్, సమంతల నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
Junior NTR https://t.co/DWy4ETZXjZ
— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) 12 May 2016

