
విడుదలైన ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమా ప్రీ లుక్ పోస్టర్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పోస్టర్ ని దర్శక ధీరుడు ’బాహుబలి’ దర్శకుడు యస్. యస్. రాజమౌళి ని విశేషంగా ఆకట్టుకున్నట్టు ఆయన స్వయంగా తెలియచేశారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన రాజమౌళి ‘ఈ పిక్ ని లేట్ గా చూశా.. వావ్.. టెర్రిఫిక్..!!!’ అని ట్వీట్ చేశాడు.
త్వరలో ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ మూడో షెడ్యూల్ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. జాతీయ అవార్డు గ్రహీత క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో గౌతమీ పుత్ర శాతకర్ణి భార్య వాశిష్టా దేవి పాత్ర కు హీరోయిన్ శ్రేయ ఎంపికైంది. ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్’ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Saw the pic late…
Wow..terrific…!!! pic.twitter.com/cZRrjlYz1g— rajamouli ss (@ssrajamouli) June 11, 2016

