‘సాహసం శ్వాసగా..’ రిలీజ్‌పై గౌతమ్ మీనన్ అప్‌డేట్

‘సాహసం శ్వాసగా..’ రిలీజ్‌పై గౌతమ్ మీనన్ అప్‌డేట్

Published on Sep 2, 2016 3:22 PM IST

Gautam-Menon
దర్శకుడు గౌతమ్ మీనన్, హీరో నాగచైతన్యల కాంబినేషన్‌లో ‘సాహసం శ్వాసగా సాగిపో’ అన్న సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. టీజర్, ఆడియోతో విపరీతమైన అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా చాలాకాలంగా ఓ సరైన విడుదల తేదీ కోసం ఎదురుచూస్తోంది. కొద్దిరోజుల క్రితమే అక్టోబర్ మొదటి వారంలో సినిమా విడుదలవుతుందని గౌతమ్ మీనన్ ప్రకటించినా, అందులో కూడా మార్పు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ మొదటివారంలోనే దసరా కానుకగా చైతన్య నటించిన మరో సినిమా ‘ప్రేమమ్’ విడుదల కానున్న నేపథ్యంలో ‘సాహసం శ్వాసగా..’ కోసం గౌతమ్ వేరే తేదీని పరిశీలిస్తున్నారు.

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో సినిమా విడుదలవుతుందని, విడుదల తేదీ విషయమై ఇంకా ఆలోచిస్తున్నామని, పక్కాగా ఒక విడుదల తేదీ అనుకోగానే ప్రకటిస్తామని గౌతమ్ మీనన్ స్పష్టం చేశారు. గౌతమ్ మీనన్ – నాగ చైతన్య – ఏ.ఆర్.రహమాన్‌ల కాంబినేషన్‍లో ‘ఏ మాయ చేసావే’ లాంటి క్లాసిక్ హిట్ తర్వాత వస్తోన్న సినిమా కావడం ‘సాహసం శ్వాసగా సాగిపో’కు ప్రత్యేకత తెచ్చిపెట్టింది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ వర్షన్‌లో శింబు హీరోగా నటించారు.

తాజా వార్తలు