ఆ పుస్తకం చదవడానికి మహేష్ బాబు తెగ తొందరపడుతున్నాడు !

ఆ పుస్తకం చదవడానికి మహేష్ బాబు తెగ తొందరపడుతున్నాడు !

Published on Dec 17, 2016 3:20 PM IST

dhevudu-lanti
మహేష్ బాబు ఒక పుస్తకాన్ని చదవడానికి తెగ తొందరపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. ఆ పుస్తకం ఎవరిదో కాదు ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణకు సంబందించిన పుస్తకం. సీనియర్ జర్నలిస్ట్ వినాయక రావు సీనియర్ నటుడు కృష్ణ సినీ, వ్యక్తిగత జీవితాన్ని పరిశోధించి ‘దేవుడులాంటి మనిషి’ పేరుతో కృష్ణ జీవిత చరిత్రను రాశారు. ఈ పుస్తకంలో సినీ రంగానికి, వ్యక్తులకు కృష్ణ చేసిన సహాయం, అయన అంట గొప్ప నటుడిగా, వ్యక్తిగా ఎదిగిన ప్రయాణం వంటి అంశాలు చర్చించడం జరిగిందట.

ఈ పుస్తకాన్ని కొద్దిసేపటి క్రితమే కె. రాఘవేంద్ర రావు, ఎస్వీ కృష్ణా రెడ్డి, విజయ నిర్మల, కృష్ణ, సుబ్బిరామి రెడ్డి ల సమక్షంలో విడుదల చేశారు. ఈ విషయాన్నే మహేష్ ట్విట్టర్ ద్వారా ప్రస్తావిస్తూ ‘దేవుడులాంటి మనిషి’ పుస్తకం ఈరోజే లాంచ్ అయింది. మా నాన్నకు నిజమైన టైటిల్ అది. ఆ పుస్తకాన్ని ఎప్పుడెప్పుడు చదువుదామా అని ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు