చిన్న సినిమాకి రాజమౌళి హీరో సపోర్ట్ !

చిన్న సినిమాకి రాజమౌళి హీరో సపోర్ట్ !

Published on Dec 23, 2016 12:00 PM IST

SS-RAJAMOULI
ఈ మధ్య కాలంలో కేవలం ట్రైలర్స్, టీజర్లతోనే మంచి క్రేజ్ క్రియేట్ చేసుకున్న చిత్రం ‘పిట్టగోడ’. ఈ చిత్రానికి సోషల్ మీడియాలో ప్రేక్షకుల నుండి మంచి సపోర్ట్ వస్తోంది. అలాగే సినీ ప్రముఖులు కూడా ఈ చిత్రానికి అండగా నిలుస్తూ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు ఈ సినిమాని సమర్పిస్తూ పెద్ద సపోర్ట్ ఇవ్వగా ప్రముఖ హీరో, రాజమౌళి ‘ఈగ’ సినిమాతో స్టార్ గా ఎదిగి సహజ నటుడు అనే బిరుదుని సొంతం చేసుకున్న నాని కూడా సినిమాకి తన వంతు మద్దత్తు ప్రకటించాడు.

నాని ట్విట్టర్లో మాట్లాడుతూ ‘పిట్టగోడ సినిమా చూశాను. చాలా బాగుంది. మనసుకు హత్తుకునే సినిమా. మీరు కూడా చూడండి’ అంటూ ట్వీట్ చేశాడు. ట్విట్టర్లో నానికి ఫాలోవర్స్ ఎక్కువగా ఉండటం వలన ఈ ట్వీట్ నిముషాల్లోనే పాకిపోయి సినిమా పట్ల ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. నూతన దర్శకుడు అనుదీప్ డైరెక్ట్ చేస్తున్నఈ చిత్రం రేపు డిసెంబర్ 24న రిలీజ్ కానుంది. నలుగురు కుర్రాళ్ళ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పునర్నవి భూపాలం హీరోయిన్ గా నటిస్తోంది.

తాజా వార్తలు